విద్యారంగ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు : మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

sfi state conferece in kakinada 1

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. 24వ రాష్ట్ర మహాసభల్లో ఆయన ప్రారంభ ఉపన్యాసమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు బ్రతికి ఉన్నాయంటే ఎస్ఎఫ్ఐ పొరటాల వల్లనే అన్నారు. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా సమర శీలంగా పోరాడుతున్న సంఘం ఎస్ఎఫ్ఐ అన్నారు.చదువు వెనుకబాటు తనం,దోపిడీ, ఆజ్ఞానం,అన్యాయం నుంచి బయటకి తెచ్చేదిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవలుచుకోవలన్నారు. వీరేశలింగం విద్యార్ధులు చదువుకోవాలని సైన్స్ కోసం తెలుసుకోవాలని పాటు పడ్డారు.నూతన విద్యా విధానం వలన జరుగుతున్న నష్టాలను వివరించారు.రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల స్కూళ్ళు మూతబడ్డాయన్నారు. ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ కావడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమన్నారు.నానాటికీ విద్యా ప్రమాణాలు దిగజారుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీలో నాణ్యమైన చదువులు కరువయ్యాయన్నారు.

*****************************************************

 

sfi state conferece in kakinada ashok

  • ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమం : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్

రాజమహేంద్రవరం ప్రతినిధి  :  ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని విద్యారంగ సమస్యలపై గడిచిన రెండు సంవత్సరాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విశాల ఉద్యమం నిర్వహించామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈ అశోక్ తెలిపారు. అదే స్ఫూర్తితో రాబోయే రోజులలో విద్యార్థులు పోరాటాల్లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ 24 రాష్ట్ర మహాసభల సందర్భంగా ధీరజ్ రాజేంద్రన్ ప్రాంగణం అల్లూరి సీతారామరాజు నగర్ లో బుధవారం కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అనుసరిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలను వివరించారు. విద్యార్థి దశమించే విద్వేషాలను పెంచి పోషించేలా మోడీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం అమలు చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పాఠ్యపుస్తకాలను మార్పులు చేర్పులకు పాల్పడుతోందని తెలిపారు . దేశ చరిత్రను వక్రీకరించడమే కాకుండా లేనిది ఉన్నట్లుగా పాఠ్యాంశాల్లో చెప్పించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేళ్లలో నిరుద్యోగం మరింత పెరిగింది అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దోచిపెట్టడమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని అన్నారు. దీనిలో భాగంగానే విశాఖ ఉక్కు, హైవేలు, పోర్టుల ప్రైవేటీకరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ జరగడంతో ఉపాధి పైన తీవ్ర ప్రభావం చూపన ఉందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. యూనివర్సిటీలను రాజకీయ హబ్బు లగా మార్చిందని విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి సమావేశంలో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారని గడిచిన నాలుగు సంవత్సరాలు పూర్తి భిన్నంగా వ్యవహరించారని తెలిపారు. విద్యార్థులు లేరని సాగుతూ ప్రభుత్వ పాఠశాలల మూసివేత, ఎయిడెడ్ విద్యాసంస్థలు నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడం ఉదాహరణగా చెప్పారు .ఈ నేపథ్యంలో నిర్వహించిన ఉద్యమాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఎయిడెడ్ విద్యా సంస్థల రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బస్సు యాత్రను గుర్తు చేస్తూ ప్రభుత్వం కొనసాగించిన నిర్బంధాన్ని వివరించారు. ప్రభుత్వ నిర్బంధాలను తట్టుకొని విద్యార్థులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా గడిచిన రెండేళ్లలో నిర్వహించిన ఉద్యమాలను సాధించిన విజయాలను వివరించారు.

 

నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి), బిజెపిని వ్యతిరేఖిద్దామని, విద్యా వ్యవస్థను, దేశాన్ని పరిరక్షించుకుందామని ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను అన్నారు. ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభల సందర్భంగా కాకినాడ వచ్చిన ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు.

 

flag mlc iv

  • ఆహ్వాన సంఘం ఉపన్యాసం చేసిన ఎమ్మెల్సీ ఐవి

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 24వ రాష్ట్రమహాసభలు ఆహ్వాన ఉపన్యాసం ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 53 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ అనేక సమరశీల పోరాటాలు చేసిందన్నారు. విద్యార్థుల హక్కులు నాణ్యమైన విద్య అందించేందుకు ఎందరో విద్యార్థి నాయకులు తమ ప్రాణాలను అర్పించారన్నారు. మహాసభలు జరుగుతున్న కాకినాడకు ఎంతో చరిత్ర ఉందన్నారు. శాతవహానులు, అశోకుడు, పల్లవులు, చాణిక్యులు, చోళులు, కొండవీటి రెడ్లు, గజపతి రాజులు, 1687 లో ఔరంగజేబు, 1724 లో నిజాం జమీందారిలో పాలనలో కాకినాడలో ఉందన్నారు. డచ్ వాస్తు శిల్పి నైపుణ్యంతో నిర్మించిన చర్చ్ స్క్వేర్ వంటివి ఉన్నాయన్నారు.రేవు పట్టణం, విద్యాలయాలు కేంద్రంగా, రెండవ మద్రాసుగా, మినీ బెంగుళూరు గా కాకినాడ ఉందన్నారు. అనేక పోరాటాలకు కాకినాడ కేంద్రంగా ఉందన్నారు. విద్యార్థి ఉద్యమంలో ఉన్న వారు నుంచి ఎందరో దేశ, విదేశాల్లో కీలకంగా అటు ఉద్యమాల్లో వివిధ శాఖల్లో ఉన్నారన్నారు. భవిష్యత్ లో మరిన్నీ సమరశీల పోరాటాలకు కాకినాడ రాష్ట్ర మహాసభ వేదిక కావాలన్నారు.

 

ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభ ఏర్పాట్లపై ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు

 

flag

 

జెండాను అవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్న కుమార్

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 24వ రాష్ట్ర మహాసభలు అల్లూరి సీతారామరాజు నగర్, ధీరజ్ సభా ప్రాంగణంలో ఉత్సాహపూర్తమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కే.ప్రసన్నకుమార్ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం నినాదాలు ఉన్న జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడు విపి సాను అమరవీరుల స్థూపానికి ,అల్లూరి సీతారామరాజు, ధీరజ్ రాజేంద్రన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు ఆదర్శ సాజి, ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ మాజీ ఆల్ ఇండియా అధ్యక్షులు వై. వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, తదితరులు నివాళులర్పించారు. మహాసభ ప్రాంగణం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి కళాకారులు గీతాలు ఆలపించారు.ఈ సందర్భంగా విప్లవ గీతాలను ఆలపించారు. “వీరులారా వందనం.. విద్యార్థి అమరులారా వందనం మీ పాదాలకు’… అంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు గీతాలు ఆలపించారు.

 

  • మరి కాసేపట్లో ప్రారంభం కానున్నఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభ 

విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 24వ రాష్ట్ర మహాసభలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అల్లూరి సీతారామరాజు నగర్ లో ధీరజ్ సభ ప్రాంగణంలో మహాసభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాయకులు తెలిపారు. మహాసభల ప్రాంగణం వద్ద 1970 సంవత్సరం నుండి గత 2021 సంవత్సరం వరకు మహాసభల్లో ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శుల ఫోటో ఫ్రేమ్స్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద సెల్ఫీ ఫ్రేమ్, ఐ లవ్ ఎస్ఎఫ్ఐ, ప్రధాన ద్వారం ఎదురుగా ‘మా స్ఫూర్తి’ అంటూ దేశ, అంతర్జాతీయ నాయకుల చిత్రపటాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇప్పటికే హాజరై ఉన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు విద్యార్థి ఉద్యమ గీతాలను ఆలపిస్తున్నారు.

 

 

 

➡️