చంద్రబాబును కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన షర్మిల

Jan 13,2024 12:04 #Chandrababu Naidu, #ys sharmila

హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబును కాంగ్రెస్‌ నాయకురాలు వైఎస్‌ షర్మిల శనివారం కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల… తన కుమారుడి వివాహానికి రావాలని బాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. తమ నివాసానికి వచ్చిన షర్మిలను చంద్రబాబు దంపతులు సాదరంగా ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడే అవకాశం ఉంది.

➡️