యాగంటిలో పుష్ప- 2 షూటింగ్‌

Mar 19,2024 22:31 #Pushpa-2, #Shooting, #Yaganti

ప్రజాశక్తి – బనగానపల్లె : నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం పుష్ప-2 సినిమా షూటింగ్‌ నిర్వహించారు. పుష్ప-1 క్లైమాక్స్‌లో వచ్చే హీరో వివాహ సన్నివేశం కొనసాగింపుగా వచ్చే సన్నివేశాన్ని యాగంటి దేవస్థానం గుహలో చిత్రీకరించారు. సుకుమార్‌ దర్శకత్వంలో జరిగిన ఈ షూటింగ్‌లో హీరోయిన్‌ రష్మిక , నటి రమ్యకృష్ణ, నటుడు అజరు తదితరులు పాల్గొన్నారు.

➡️