ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌కు షోకాజ్‌ నోటీసులు

Jan 9,2024 12:59 #IAS, #Telangana

హైదరాబాద్‌ : అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్‌ ఒప్పందం చేసుకున్నారని సీనియర్‌ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మంళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.ఈ రేసు ఒప్పందం ఎందుకు చేసుకున్నారో తెలపాలని సీఎస్‌ నోటీసులు జారీ చేశారు. హెచ్‌ఎండీఏ నిధులు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించారో తెలపాలని నోటీసుల్లో ఆదేశాలు జారీ చేశారు. వారం రోజులు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సీఎస్‌ కోరారు.

➡️