నేడు ఏసీబీ కోర్టులో స్కిల్‌ కేసు విచారణ

Jan 23,2024 10:27 #Chandrababu Naidu

ప్రజాశక్తి-అమరావతి : చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అప్రూవల్‌గా మారిన నిందితుడు ఏసీఐ ఎండి శిరీష్‌ చంద్రకాంత్‌ షాను విచారించే క్రమంలో సీఐడి కోర్టు సమర్పించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని చంద్రబాబు తరపున న్యాయవాదులు కోరారు. దీనిపై పిటిషన్‌ దాఖలు చేయాలని చంద్రబాబు తరపున న్యాయవాదులకు కోర్టు అదేశించింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.

➡️