ఎండల్లోనూ…హుషారుగా ఓటింగ్

May 13,2024 14:38 #poling

ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్
మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, 25 పార్లమెంట్‌ స్థానాలకు సోమవారం పోలింగ్‌ కొనసాగుతోంది. అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటికే ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి మరీ ఓట్లు వేస్తున్నారు. ఇవిఎంలు మొరాయించిన చోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. ఆయా కేంద్రాల్లో పోలింగ్‌ మరింత ఆలస్యం కానుంది. ఏపీలో పోలింగ్‌ శాతం ఇలా..కడపలో 27.17 శాతంచిత్తూరులో 26.10శాతంబాపట్లలో 26.80 శాతంఅల్లూరిలో 18.43 శాతంఅనకాపల్లిలో 19.97 శాతంఅనంతపురంలో 23.91 శాతంఅన్నమయ్యలో 22.28 శాతంకఅష్ణాలో 26.14 శాతంకోనసీమలో 26.81 శాతంనంద్యాలలో 26.60 శాతంవిశాఖలో 20.42 శాతంఏలూరులో 24.40 శాతంప.గో.లో23.35 శాతంనెల్లూరులో 23.60 శాతంకర్నూలులో 21.90 శాతంప్రకాశంజిల్లాలో 24.10 శాతంఎన్టీఆర్‌ జిల్లాలో 29 శాతంవిజయనగరంలో 23.19 శాతంతూ.గో.లో 21.79 శాతంపల్నాడులో 23.18 శాతంశ్రీకాకుళంలో 21.54 శాతంతిరుపతిలో 22.80 శాతంగుంటూరులో 24.28 శాతంకాకినాడలో 21.45 శాతంసత్యసాయి జిల్లాలో 20.58 శాతంమన్యంజిల్లాలో 18.61 శాతం

➡️