సంబల్‌పూర్‌ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు

May 5,2024 20:29 #tarin

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : ప్రయాణికుల అదనపు రద్దీ దృష్ట్యా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే దువ్వాడ మీదుగా సంబల్‌పూర్‌ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 08323 సంబల్‌పూర్‌-కాచిగూడ వేసవి ప్రత్యేక రైలు మే 13 నుంచి జూన్‌ 24 వరకు ప్రతి సోమవారం రాత్రి 21.00 గంటలకు సంబల్‌పూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 07.20 గంటలకు దువ్వాడ చేరుకుని మరలా 07.25 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 21.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 08324 కాచిగూడ – సంబల్‌పూర్‌ వేసవి ప్రత్యేక రైలు మే 14 నుండి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం రాత్రి 23.20 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు దువ్వాడ చేరుకుని మరలా 12.35కి బయలుదేరి అదేరోజు రాత్రి 23.45 గంటలకు సంబల్‌పూర్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు బార్‌ఘర్‌ రోడ్డు, బలంగీర్‌, తిట్లాగఢ్‌, కేసింగ, మునిగూడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, తుని, పిఠాపురం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, చెర్లపల్లి, మల్కాజిగిరి మీదుగా ప్రయాణిస్తాయి.

➡️