నీట్‌ 2024 ఫలితాల్లో శ్రీచైతన్య సరికొత్త రికార్డ్‌

Jun 5,2024 21:45 #neet exam, #Sri Chaitanya

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :నీట్‌ 2024 ఫలితాల్లో శ్రీచైతన్య ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ఓపెన్‌ కేటగిరిలో 720కి 720 మార్కులతో తొమ్మిది ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు సాధించింది. టాప్‌ ర్యాంకులతో పాటు టోటల్‌ ర్యాంకుల్లోనూ శ్రీచైతన్య విద్యార్ధులు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఓపెన్‌ కేటగిరిలో వి. కల్యాణ్‌, పి.పవన్‌ కుమార్‌ రెడ్డి, ముఖేష్‌ చౌదరి, భానుతేజసాయి, ఇరాన్‌ ఖ్వాజీ, దర్శ్‌ పగ్దార్‌, ఇషా కొఠారి, ఆదర్శ్‌ సింగ్‌ మోయల్‌, అమీనా అరిఫ్‌ కడివాలాలు ఒకటవ ర్యాంకు సాధించారు. 720మార్కులతో తొమ్మిది మంది, 715 మార్కులు ఆపైన 57మంది, 700 మార్కులు ఆ పైన 132 మంది, 650 మార్కులు ఆపైన 852 మంది శ్రీ చైతన్య విద్యార్ధులే. ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ మాట్లాడుతూ..నీట్‌ 2024లో తమ విద్యార్ధుల అద్భుత ప్రతిభ గర్వంగా ఉందన్నారు. ఈ విజయానికి కారణమైన విద్యార్ధులకు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు. ఎయిమ్స్‌లో 27శాతం మంది వైద్యులు శ్రీచైతన్యలో చదివినవారేననీ చెప్పారు. త్వరలో జరిగే ఐఐటి అడ్వాన్స్డ్‌లోనూ తమ విద్యార్ధులు సత్తా చాటుతారని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.

➡️