Delhi Liquor Case: కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సీబీఐ..

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీచేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు.

➡️