‘అనంత’లో వేరుశనగ పంపిణీ ప్రారంభం

ప్రజాశక్తి – అనంతపురం : అనంతపురం జిల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. సబ్సిడీ విత్తనాల కోసం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆయా రైతు భరోసా కేంద్రాల పరిధిలో 40,704 మంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. గుమ్మఘట్ట మండల కేంద్రంలో విత్తన పంపిణీని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ప్రతి రైతుకూ విత్తన కాయలు అందిస్తామని కలెక్టర్‌ తెలియజేశారు. అర్థఎకరా రైతుకు 30 కేజీల బ్యాగు ఒకటి, ఎకరా ఉన్న వారికి రెండు బ్యాగులు, ఎకరాకు మించి ఉన్న రైతులకు మూడు బ్యాగులు అందజేయనున్నారు. ఒక్క బ్యాగుకు ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. 4.94 లక్షల ఎకరాల్లో వేరుశనగను సాగు చేయనున్నారని అధికారులు అంచనా వేశారు.

➡️