యూనివర్సిటీ బస్సును ఢీకొట్టిన టిప్పర్‌ – విద్యార్థులకు గాయాలు

గజపతినగరం (విజయనగరం) : సెంచ్యురియన్‌ యూనివర్సిటీ బస్సును టిప్పర్‌ ఢీకొట్టడంతో విద్యార్థులకు గాయాలవ్వగా, ఒకరికి కాలు విరిగిన ఘటన బుధవారం ఉదయం విజయనగరం జిల్లా గజపతినగరం – బండపల్లి రోడ్‌ మధ్యలో జరిగింది. రెండు వాహనాల డ్రైవర్లు వారి వాహనాల్లో ఇరుక్కుపోయారు. ఘటనా స్థలానికి స్థానికులు చేరుకున్నారు. వెంటనే గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్లను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

➡️