వైద్యవిద్యార్థి అనుమానాస్పద మృతి

Apr 6,2024 00:15 #death, #medicine student

ప్రజాశక్తి -తిరుపతి సిటీ : వైద్య విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు … పద్మావతి మహిళ వైద్య కళాశాలలో మూడవ సంవత్సరం అభ్యసిస్తున్న కె.మోక్ష (22) ఎస్‌వి యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రతాప్‌ అపార్ట్‌మెంట్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం ఇంట్లో ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడంతో గమనించిన తల్లి వెంటనే కుమార్తెను స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. అధిక మోతాదులో మందు బిల్లలు వేసుకోవడం వల్ల మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విద్యార్థి తండ్రి బాబ్జి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️