ఓటర్లకు తాయిలాలు…

May 11,2024 15:19 #vote

ప్రజాశక్తి -కాళ్ళ
పోలింగ్‌ సమయం దగ్గర పడుతోంది. మరో ఒక్క రోజులో ఓట్లు వేసేందుకు ఓటర్లు సిద్ధపడుతున్నారు. నియోజకవర్గంలో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ముఖ్యంగా కనుమూరు రఘురామకృష్ణంరాజు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండటంతో ప్రలోభాల వ్యవహారంతో మరింతగా వేడెక్కింది. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ అధికార వైసిపి అభ్యర్థి పివి ఎల్‌ నరసింహరాజు, టిడిపి నుంచి కనుమూరు రఘురామకృష్ణంరాజు మధ్యనే నెలకుంది. కీలక సామాజిక వర్గాల ఓటర్లు…ఉండి నియోజకవర్గంలో 239పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 2,24,725మంది ఓటర్లు ఉన్నారు.పురుషుల ఓటర్లు 1,10,146 మంది, మహిళల ఓటర్లు 1,14,577మంది ఉన్నారు.పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లు 4,431మంది ఉన్నారు.నియోజకవర్గంలో కీలక సామాజిక వర్గాల ఓటర్లు. అత్యధికంగా ఉన్న కాపులు 46వేల ఓట్లు, శెట్టి బలిజ ఓట్లు 28వేలు,క్షత్రియుల ఓట్లు 24వేలు, ఎస్సీఓట్లు 28వేలు,తూర్పు కాపుల ఓట్లు 22వేలు, యాదవ 9వేలు, అగ్నికులక్షత్రియులు ఓట్లు 6వేలు, రజక 6వేలు, ఆర్యవైశ్య ఓట్లు 5వేలు ఇతర బీసీ కులాలు 30వేల ఓట్లు ఉన్నాయి. కాపులు,ఎస్సీ,బీసీల ఓటర్ల నిర్ణయంపై ఫలితం ఆధారపడి ఉంది.వీరి లో అధిక శాతం ఓట్లు తమ పార్టీకే వేసేలా పార్టీలు నిమగమయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ బలాబలాలను బేరీజు వేసుకుంటూ ఓటింగ్‌ తగ్గేచోట డబ్బులను పంచే ఏర్పాట్లు చేసేశారు. వైసీపీ, టీడీపీ, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాగ్‌ ల మధ్య హోరా హోరీగా ఉంది. కూటమి నుంచే ఎక్కువగా నగడు పంపిణీ కూటమి పక్షాన అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గం తమకు అడ్డుగా, బలంగా నిలుస్తున్నారన్న అంచనా ఉన్న నియోజకవర్గం పై వైసీపీ ఇప్పటికే కన్నెసింది. ఈ నియోజకవర్గంలో అన్నింటిలోనూ మహిళా గ్రూపులు అన్నింటికి రూ.10 నుంచి రూ.12 వేలు చొప్పున పంపిణీ పూర్తి చేశారు. మిగతా ప్రాంతాల్లో కుల సంఘాలకు ఓట్ల సంఖ్యను బట్టి రూ.3 నుంచి రూ.6 లక్షలు వెదజల్లుతున్నారు. ఇదంతా తెల్లవారుజాము నుంచి ఇంటింటికి సాగుతోంది. మరికొన్ని చోట్ల మిగతా పార్టీలు కన్ను కప్పి సాయంత్రం వేళ పూర్తి చేస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసుల నిఘా వర్గాలు కంట పడకుండా మరి పంపిణీ పాత్ర పోషించేందుకు కొందరు స్పెషల్‌గా పని చేస్తున్నారు. పోలింగ్‌కు ముందుగా ఈ పంపిణీ తతంగం పూర్తి చేసి పోలింగ్‌ రోజు నగదు పొందినవారంతా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేలా స్కెచ్‌ చేశారు. నియోజక వర్గానికి వైసీపీ,టిడిపి పార్టీలు రూ.30 కోట్లు తగ్గకుండా పంపిణీకి ఏర్పాటు చేసినట్టు ఆనోట ఈనోటా ప్రచారం సాగుతోంది.వైసిపి ప్రత్యేక కేంద్రీకరణఈ ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజును ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలనే లక్ష్యంతో అధికార వైసిపి మరింతగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల రూ.1500 నుంచి రూ.2000 చొప్పున రెండు ప్రధాన పార్టీలు అందచేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రెండు ప్రధాన పార్టీలు ఓటుకు రూ.2వేలు చొప్పున పంపిణీని ప్రారంభించారు. ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా నగదు పంపిణీ జరుగుతున్నా ఎన్నికల అధికారులు పత్తా లేకుండా పోతున్నారు. గతంలో నియోజకవర్గంలో ఈ పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ డబ్బు పంపిణీలో ఇతర ప్రాంతాలకు చెందిన వారే క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయా తరగతుల వారీగా ఓటు విలువకు ధర నిర్ణయించి పంపిణీ చేస్తున్నారు.

➡️