వైసిపిపై టిడిపి దాడులు

May 13,2024 15:03 #TDP

అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ వారిపై టిడిపి శ్రేణులు దాడిచేశారు. మోపిదేవి లంక గ్రామానికి చెందిన రాజుల పాటి నాగేశ్వరరావు, కేసాని తేజశ్రీ, మోర్ల శీను పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఇరుగ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాడిలో గాయాలైన వారిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌ బాబు బాధితులను పరామర్శించారు. టిడిపి, వైసిపిల మధ్య ఘర్షణకృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం మండలం ముస్తాబాదలో టిడిపి, వైసిపిల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌, యార్లగడ్డ వెంకట్రావుల అనుయాయుల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం, చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. వైసిపి నేతపై దాడిఎన్టీఆర్‌ జిల్లా మైలవరం గణపవరం గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద టిడిపి, వైసిపిల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైస్సార్సీపీ నాయకుడు కొత్తపల్లి వెంకటేశ్వరరావు పై టీడీపీ నాయకుడు శ్యామ్‌ దాడిచేశారు. కుర్చీతో దాడి చేయటంతో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో ఇరుగ్రూపుల వారు పారిపోయారు. ఎన్నికల అధికారులతో వాగ్వాదం బందర్‌రోడ్డు మాంటిస్సోరి పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో మౌలిక వసతులు లేక ఓటర్లు ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఓటర్లు రెండు గంటల తరబడి ఎండలో నిల్చోవాల్సివచ్చింది. ఇదేమిటని ప్రశ్నించిన ఓటర్లపై పోలింగ్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.నెల్లూరులో ఘర్షణ వాతావరణంనెల్లూరు జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. ప్రజలు పోలింగ్‌ బూతులు వద్ద పెద్ద సంఖ్యలో క్యూలో నిలుచున్నారు. ఎప్పుడు ఈ విధంగా లేదు.ఈసారి ఎక్కువ శాతం పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది.చేజర్ల మండలంలో కొంత టిడిపి, వైసిపి నాయకులు మధ్య చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో అది కాస్త సద్దుమణిగింది. ఆత్మకూరు పట్టణంలో 128 పోలింగ్‌ బూత్‌ లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉదయం 6.30 గంటలకు పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం బారులు తీరారు.

➡️