విజయనగరంలో టిడిపి బొబ్బిలి గర్జన సభ

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో చేపట్టిన రా కదలి రా బొబ్బిలి గర్జన సభకు వేలాది సంఖ్యలో టిడిపి శ్రేణులు చేరుకుంటున్నారు. సభ ప్రాంగణానికి జిల్లా నలుమూలల నుంచి టిడిపి కార్యకర్తలు చేరుకుంటున్నారు. పట్టణమంతా పసుపుమయమైంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా ప్రజలు సభకు చేరుకుంటున్నారు. మున్సిపాలిటీలో పాతబొబ్బిలి, గొల్లపల్లి, మల్లమ్మపేట, పలువార్డుల నుంచి ర్యాలీగా సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. బొబ్బిలి గర్జన సభకు మరొకొద్ది సేపటిలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు చేరుకోనున్నారు.

➡️