అమెరికాలో తెలంగాణ యువకుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి

తెలంగాణ : సికింద్రాబాద్‌ తిరుమలగిరికి చెందిన రుత్విక్‌ రాజన్‌ అనే యువకుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో అమెరికాలో మృతి చెందిన ఘటన అతడి కుటుంబంలో విషాదం నింపింది.

రిటైర్డ్‌ ఆర్‌డిఒ తులసీరాజన్‌ పెద్ద కుమారుడు బండ రుత్విక్‌ రాజన్‌  (30) రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో చేరి ఇటీవలే ఎంఎస్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం వెతుకుతున్న రుత్విక్రాజ్‌ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గత వారం రుత్విక్‌ తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. రుత్విక్‌రాజ్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినట్లు తేలింది. ఆదివారం రాత్రి రుత్విక్‌ మఅతదేహం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌కు తరలించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, రుత్విక్‌ స్నేహితులు శోకసంద్రంలో మునిగారు. అందరితో స్నేహంగా మెలిగేవాడని, మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి పెద్దదిక్కు అవుతాడని భావించామని కుటుంబ సభ్యులు వాపోయారు. అందరితో కాసేపు ఫోన్‌ లో మాట్లాడిన రుత్విక్‌ … కొద్దిసేపటికే చనిపోయాడని వార్త రావడం కలిచివేసిందని కంటతడిపెట్టారు.

➡️