ఓట్లను తొలగించిందీ లేనిదీ చెప్పండి : ఎన్నికలు సంఘానికి హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి, అమరావతి : ఓటర్ల జాబితా నుంచి పిటిషనర్ల పేర్లను తొలగిస్తూ ఎన్నికల అధికారుల ఉత్తర్వుల తీరును హైకోర్టు ఆక్షేపించింది. పిటిషనర్ల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్నారో లేదో, ఓట్లను తొలగించిందీ లేనిదీ వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రఘునందన్‌రావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం ఆదేశాలచ్చింది. విచారణను మార్చి 5కి వాయిదా వేసింది. నోటీసు ఇవ్వకుండా ఓటర్ల వివరణ తీసుకోకుండా ఫారం 7 ఆధారంగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారంటూ పర్చూరు మండలం, తిమ్మరాజుపాలెంకి చెందిన బి గౌతమి సహా 11 మంది పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

➡️