తెలుగు మహా సభలు ఒక చారిత్రక ఘట్టం : బండారు దత్తాత్రేయ

Jan 8,2024 08:08 #Bandaru Dattatreya, #press meet

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలు ఒక చారిత్రక ఘట్టమని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం మూడో రోజు తెలుగు మహాసభల్లో ఆయన వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. భారతీయ భాషల్లో తెలుగు భాష సుందరమైనదని కీర్తించారు. ఏ భాషలో లేని అవధాన ప్రక్రియ ఉన్న తెలుగు అత్యంత మధురమైన భాష తెలిపారు. త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, పోతన, శ్రీనాథుడు, విశేష కృషి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పారని, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె, పింగళి, వేటూరి వంటి ఎందరో గొప్ప కవుల రచనలు మన భాషను సుసంపన్నం చేశారన్నారు. అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ, కందుకూరి వీరేశలింగం పంతులు, మధునా పంతులు, శ్రీపాద వంటి ఎందరో గొప్ప వ్యక్తులు జన్మించిన, ఆ ప్రాంతంలో నడియాడిన ప్రదేశం రాజమహేంద్రవరం అని ఆయన కొనియాడారు.

➡️