పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత – దళితుల నిరసన

పశ్చిమ గోదావరి జిల్లా : పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెనుగొండకు చెందిన సూర్య ఇంస్టాగ్రామ్‌ లో అంబేద్కర్‌ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ … గురువారం రాత్రి పెనుగొండ మండలం పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద దళితులు నిరసన చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌ ను ముట్టడించి రాళ్ళతో అద్దాలను, పోలీస్‌ స్టేషన్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీస్‌ బలగాలు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్‌ చేశారు. దీంతో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు చెదరిపోయారు.

➡️