పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, వివాదాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చేతులు కలిపి.. సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కోరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.”ప్రపంచం మరోసారి భారత్‌ వైపు చూస్తోంది. అందరూ ఐక్యంగా ముందుకు సాగి దేశాన్ని శక్తిమంతంగా తయారు చేసేందుకు పాటుపడాలి. ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో ముందుకుపోతోంది. నాకు ‘పద్మవిభూషణ్‌’ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది” అని వెంకయ్యనాయుడు అన్నారు.

➡️