13కు చేరిన మావోయిస్టుల మృతులు

Apr 3,2024 22:47 #Bandh, #death, #mavoist

ప్రజాశక్తి – చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ కర్చోలి అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య బుధవారానికి 13కు చేరింది. మంగళవారం పది మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత విస్తృతంగా దండకారణ్యంలో గాలించారు. వారికి బుధవారం మరో ముగ్గురి మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు ఎనిమిది గంటలపాటు కాల్పులు జరగడంతో దండకారణ్యంలో యుద్ధవాతావరణం నెలకొంది. డిఆర్‌జి, ఆర్‌పిఎఫ్‌, కోబ్రా బెటాలియన్‌, బస్తర్‌ బెటాలియన్‌ దళాలు కూంబింగ్‌లో పాల్గన్నట్టు ఐజి పి.సుందర్‌ రాజ్‌ వెల్లడించారు.

➡️