తన పేరు లేదని శిలాఫలకాలను ధ్వంసం చేసిన వైసిపి సర్పంచ్‌

Feb 27,2024 18:05 #Prakasam District, #sarpanches, #YCP

ప్రజాశక్తి- యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గం వైసిపి మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పెద్దారవీడు మండలం చట్లమిట్ట, రేగుమానుపల్లి గ్రామాలకు ఒకే సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు లేదని రేగుమానుపల్లి సర్పంచ్‌ రామాంజనేయరెడ్డి సుత్తితో ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వార్డుమెంబర్లు, సచివాలయం కన్వీనర్ల పేర్లు ఉన్నప్పుడు తన పేరు లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️