ఇది అభివృద్ధికర బడ్జెట్‌ : టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి వందేళ్లు పూర్తి చేసుకునే సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఉందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గురువారం నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆయన ప్రశంసించారు. కేంద్ర బడ్జెట్‌లో మౌలిక రంగానికి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టానికి పదేళ్ల కాలపరిమితి ముగుస్తున్నా రాష్ట్రానికి నిధులు సాధించడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ఐదేళ్లలో వైసిపి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయిందన్నారు.

➡️