భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు – కారణం ఇదే..!

అమరావతి : విపరీతమైన ఎండ తీవ్రత, అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంటల దిగుబడి తగ్గుతుందని, దీనివల్ల శాఖాహారం మాత్రమే కాకుండా.. మాంసాహారం ధరలు కూడా భారీగా పెరుగుతాయని నిపుణులు వెల్లడించారు.

వేడి తీవ్రత గతేడాది కంటే ఎక్కువ ….
ఇప్పటికే సూర్యుడు మండిపోతున్నాడు. పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. రానున్న రోజుల్లో రుతుపవనాలు ఆశాజనంగా ఉన్నప్పటికీ.. తీవ్రమైన ఎండ తీవ్రత తప్పదని పలువురు నిపుణులు చెబుతున్నారు. 2024 ఏప్రిల్‌ – జూన్‌ మధ్య వేడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఉష్ణోగ్రత గత ఏడాదికంటే ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

పంటలపై ప్రభావం – పాడి ఉత్పత్తులు తగ్గుదల
ఎండ తీవ్రత ప్రజల మీద మాత్రమే కాకుండా.. పంటల మీద కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల కాఫీ, పాల ఉత్పత్తులు తగ్గుతాయి. రబీ సీజన్‌లో పండించే ప్రధాన తఅణధాన్యాలలో ఒకటైన గోధుమల దిగుబడి కూడా క్షీణిస్తుందని నిపుణులు తెలిపారు. దిగుబడులు తగ్గడం వల్ల శాఖాహారం మాత్రమే కాకుండా.. మాంసాహారం ధరలు కూడా భారీగా పెరుగుతాయని వెల్లడించారు. ఎండలు పెరగటం వల్ల పాడి పరిశ్రమ కూడా దెబ్బ తింటుంది. పశుగ్రాసం కొరత, నీటి ఎద్దటి కారణంగా పాల ఉత్పత్తులు కూడా భారీగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

పెరగనున్న నిత్యావసరాల ధరలు…
2050వ సంవత్సరం నాటికి తఅణధాన్యాల దిగుబడి 9 శాతం, మొక్కజన్న ఉత్పత్తి 17 శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తద్వారా నిత్యావసరాల ధరలు కూడా మునుపెన్నడూ లేనివిధంగా పెరుగుతాయని వెల్లడించారు. అయితే మారుతున్న వాతావరణాన్ని తట్టుకోగలిగే పంట రకాలను అభివఅద్ధి చేస్తామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ గత ఆగస్టులో పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

➡️