మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్‌

Dec 25,2023 20:49 #gannavaram airport

ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో సోమవారం మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్‌ జరిగింది. హైద్రాబాద్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర లాండింగ్‌కు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. చండీగఢ్‌ నుండి హైదరాబాద్‌, గోవా నుండి హైద్రాబాద్‌, తిరువనంతపురం నుండి హైద్రాబాద్‌ వెళ్లవలసిన మూడు ఇండిగో విమానాలు గన్నవరానికి చేరుకున్నాయి. ఒక్కో విమానంలో సుమారు 165 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం పది గంటల తర్వాత తిరిగి మూడు విమానాలు హైదరాబాదు వెళ్లాయి.

➡️