ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ప్రజాశక్తి- రామాపురం(అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరిస్‌ గ్రాండ్‌ హౌటల్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ స్కూటర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు సరస్వతి పల్లెకు చెందిన గంగాభవానీ, కృష్ణబాబు, వినీతగా గుర్తించారు. తొలుత కృష్ణ మృతి చెందగా.. గంగాభవానీ, వినీత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారు రాయచోటికి వెళ్తుండగా.. ప్రమాదం జరిగినట్లు రామాపురం పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️