నేడు ‘మహాస్వాప్నికుడు’ పుస్తకావిష్కరణ

Feb 11,2024 11:56 #books, #Chandrababu Naidu

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై సీనియర్‌ జర్నలిస్ట్‌ పూల విక్రమ్‌ రచించిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకాన్ని విజయవాడలో నేటి సాయంత్రం నాలుగు గంటలకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ ఆవిష్కరించనున్నారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్‌ కోడూరి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసంతోపాటు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ఈ పుస్తకంలో స్పృశించారు. చంద్రబాబుపై జరిగిన దుష్ప్రచారంపైనా ఇందులో సవివరంగా రాసుకొచ్చారు.

➡️