కొమరంభీం జిల్లాలో విషాదం.. నదిలో నలుగురు యువకుల గల్లంతు

హైదరాబాద్‌ : హౌలీ పండుగ వేళ.. కుమురంభీం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొమరంభీం జిల్లా కౌటాల మండలం తాటి పల్లి వార్ధా నదిలో స్నానానికి వెళ్లి యువకులు గల్లంతయ్యారు. హౌలీ వేడుకలు జరుపుకున్న యువకులు ఆనందంలో స్నానం కోసం వార్ధా నదికి వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా వారు గల్లంతయ్యారు. నలుగురు గల్లంతు అయినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరూ యువకుల మతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️