రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Feb 7,2024 11:03 #Deputy Collectors, #State, #Transfer

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పెద్దయెత్తున డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల డిఆర్‌ఒ పివి రమణను మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) విసిగా నియమించారు. కోనసీమ డిఆర్‌ఒగా ఎం వెంకటేశ్వర్లును నియమించారు. అక్కడ పనిచేస్తున్న సత్తిబాబును బాపట్ల డిఆర్‌ఒగా నియమించారు. డిప్యూటీ కలెక్టరు ఎంఎస్‌ మురళీని ద్వారకా తిరుమల ఇఒగా నియమించారు. ఎపిఐఐసిలో విసిఐసి కారిడార్‌ ఎస్‌డిసిగా పనిచేస్తున్న వి దేవేందర్‌రెడ్డిని కెఆర్‌ఆర్‌సి (కోనేరు రంగారావు కమిటీ) డిప్యూటీ కలెక్టరుగా నియమించారు. గుంటూరు డ్వామా పీడీగా పి ఉమాదేవిని నియమించారు. ఇప్పటి వరకూ గుంటూరు డ్వామా ప్రాజెక్టు డైరెక్టరుగా ఉన్న ఎ కుమార్‌ను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. అనంతపురం హౌసింగ్‌ డిఎంగా గుమ్మళ్ల రమణారెడ్డిని, వెయిటింగ్‌లో ఉన్న కె భవానీని తూర్పుగోదావరి ఐసిడిఎస్‌ పీడీగా నియమించారు. డిప్యూటీ కలెక్టరుగా ప్రమోషన్‌ పొందిన ముత్యాల శ్రీనివాసును తూర్పుగోదావరి హౌసింగ్‌ పీడీగా, హంద్రీనీవా సుజల స్రవంతి డిప్యూటీ కలెక్టరుగా వెన్నెల శ్రీనును నియమించారు. హౌసింగ్‌ విభాగంలో ఎస్‌డిసిగా ఉన్న కె భాస్కర్‌ను ఏలూరులోని కెఆర్‌ఆర్‌సి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరుగా నియమించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బిఎల్‌ఎన్‌ రాజకుమారిని ప్రకాశం జిల్లా విజిలెన్స్‌ విభాగ డిప్యూటీ కలెక్టరుగా నియమించారు. నంద్యాల బిజి బంగ్లా రైల్వేలైన్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరుగా కె సుధారాణిని, జిఎన్‌ఎస్‌ఎస్‌-2 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరుగా ఉన్న ఖతీబ్‌ ఖౌసర్‌భానోను జిఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ కలెక్టరుగా మార్చారు. సోషల్‌ వెల్ఫేర్‌ జాయింట్‌ సెక్రటరీగా ఉన్న ఆర్‌ శివరావును మార్కాపురం ఆర్‌ఆండ్‌ఆర్‌ ఎస్‌డిసిగా నియమించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సింధు సుబ్రమణ్యంను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఎటపాక-1 ఎస్‌డిసిగా ఉన్న మర్రిపూడి శ్రీనివాస్‌ను కాకినాడలోని ఎపి గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరుగా నియమించారు.

➡️