20న ‘యువగళం’ ముగింపు

Dec 11,2023 20:59 #Nara Lokesh, #yuvagalam padayatra
  • విశాఖలో భారీ సభ
  • హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం ముగింపు సభను టిడిపి భారీగా చేపట్టనుంది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించిన ఈ పాదయాత్ర ఈ నెల 20తో విశాఖపట్నంలో ముగియనుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ కూడా ఈ సభకు హాజరుకానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ముగింపు సభను లక్షల మందితో టిడిపి నిర్వహించనుంది. దీనికోసం ఆ పార్టీ విజయోత్సవ సభకు కమిటీలను ఏర్పాటుచేసింది. ఆ పార్టీ మహానాడు సమయంలో మాత్రమే ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేస్తుంది. సలహా కమిటీలో యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కావలి ప్రతిభా భారతి ఉన్నారు. సమన్వయ కమిటీలో కింజరాపు అచ్చెన్నాయుడు, దామచర్ల సత్య, రవికుమార్‌, మంతెన సత్యనారాయణరాజు, రాంగోపాల్‌ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్‌, మీడియా కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, టిడి జనార్ధన్‌, బివి వెంకట్రాముడు, ఆలూరి రమేష్‌ ఉన్నారు. సభా ప్రాంగణం, ఫుడ్‌, వాటర్‌, వసతి, పార్కింగ్‌, వేదిక నిర్వహణ, వలంటీర్స్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ, రవాణా కమిటీ, ఆర్థిక వనరుల కమిటీ, మెటీరియల్‌ కమిటీ, విశాఖ బ్రాండింగ్‌ కమిటీ, మాస్టర్‌ ఆఫ్‌ సెర్మనీ పేర్లతో కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రతి కమిటీలో ముగ్గురు, నలుగురు చొప్పున సభ్యులను నియమించింది.

➡️