పవన్ వ్యాఖ్యలపై వంగా కౌంటర్

Mar 20,2024 09:35 #JanaSena, #pavan kalyan, #YCP
పిఠాపురం : వైసిపి నేత వంగా గీతను జనసేనలో చేరాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆమె కౌంటర్ ఇచ్చారు. తను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందంటూ పేర్కొన్నారు. పవన్ దింపుడు కళ్లెం ఆశలు అని ఆమె తెలిపారు. పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతుగా ఇస్తున్నారని ఆమె వెల్లడించారు.
తన మీద పోటీలో ఉన్న ప్రత్యర్థులు వంగా గీత, చలమలశెట్టి సునీల్ కూడా పార్టీలోకి రావాలంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం ద్వారానే వంగా గీత రాజకీయాల్లోకి వచ్చారంటూ పవన్ కామెంట్ చేశారు.
కానీ వాస్తవానికి పవన్ కల్యాణ్ సినీ అరంగేట్రానికి ముందు నుంచే వంగా గీత రాజకీయాల్లో ఉన్నారు. పవన్ మొదటి సినిమా 1996లో వచ్చింది. కానీ దానికి రెండేళ్ల ముందే(1994 )వంగా గీత పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
➡️