పెన్షనర్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలి

vbs demand pensioner protest

మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం

ప్రజాశక్తి-నెల్లూరు : 11వ పిఆర్సిలో తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ను ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం దశలవారై పోరాట కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ కార్డులపై గుర్తింపు పొందిన అన్ని వైద్యశాలలో పెన్షనర్లకు వైద్య సదుపాయం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షన్ల సమస్యలను పరిష్కరించకపోతే త్వరలో జరగనున్న ఎన్నికలలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

 

vbs demand pensioner protest nlr

➡️