వైరల్‌ వీడియో – కెటిఆర్‌ ట్వీట్‌ – ఖండించిన కర్నాటక సిఎం

తెలంగాణ : ”ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా ? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు ” అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీలో మాట్లాడారంటూ … ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కెటిఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆ వీడియోను రీపోస్ట్‌ చేస్తూ.. కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

కెటిఆర్‌ ట్వీట్‌ ….” ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్దరామయ్య అంటున్నారు. అలా హామీల ప్రకటన ఇచ్చే ముందు ఆలోచన చేయరా ? తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా ? ” అని కెటిఆర్‌ ప్రశ్నించారు.

ఇది దుష్ప్రచారం : కర్నాటక సిఎం

సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని కర్నాటక ముఖ్యమంత్రి ఖండించారు. ” బిజెపి నేతలు అశ్వత్‌ నారాయణ, సి.టి.రవి దుష్ప్రచారం చేస్తున్నారు. నా వ్యాఖ్యలు వక్రీకరించి ఎడిట్‌ చేసిన వీడియో ప్రసారం చేస్తున్నారు. ఎన్నికల హామీల అమలులో అసమర్థతను అంగీకరించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. 2018లో హామీలు నెరవేర్చడంలో బిజెపి విఫలమైంది ” అని సిద్దరామాయ్య తెలిపారు.

➡️