ఆల్‌ ఇండియా పోలీస్‌ కమాండో పోటీలకు విశాఖ ఆథిత్యం

విశాఖపట్నం: కోవిడ్‌ కారణంగా 11, 12వ ఏఐపీసీసీ రద్దు చేయబడ్డాయని అడిషనల్‌ డీజీపీ రాజీవ్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఇటీవల జరిగిన 13వ ఏఐపీసీసీ పోటీల్లో విజేతగా ఐటీబీపీ నిలిచిందన్నారు. ఏపీ గ్రేహౌండ్స్‌ జట్టు ఉత్తమ కాన్ఫిడెన్స్‌ కోర్స్‌ ట్రోఫిని.. 6వ ఏఐపీసీసీ పోటీలలో రన్నర్‌ ట్రోపీని గెలుచుకుంది అని చెప్పారు. ప్రస్తుతం 14వ ఏఐపీసీసీ- 2024 పోటీల్లో 23 జట్లు పాల్గనున్నాయి.. 23 జట్టుల్లో 16 రాష్ట్రాల పోలీసులు జట్లు, 7 కేంద్ర పోలీసు సంస్థల జట్లు ఉన్నాయన్నారు. రక్షణ, సౌకర్యము, భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఉన్నత స్థాయి జాగ్రత్తలు తీసుకోబడ్డాయన్నారు.అయితే, ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత హాజరుకానున్నారు.. ఈ పోటీల్లో ఐదు దశలు ఉంటాయి తమ స్థాయిలో వారిని సామర్థ్యం నైపుణ్యము.. ఓర్పును ప్రదర్శించి అత్యున్నత స్థానం కోసం ప్రయత్నిస్తాయి.. ఈ కాంపిటీషన్లో సుమారుగా 750 నుంచి 800 మంది వరకు పాల్గంటారు.. ఈ కాంపిటేషన్‌ ఈనెల 22న ప్రారంభమై 30వ తేదీ వరకు జరుగుతాయి.. ఇక, ఈ ముగింపు వేడుకలకు ఏపీ డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి హాజరవుతారు అని రాజీవ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

➡️