ఇక్కడ ఓట్లు అమ్మబడవు

May 9,2024 18:29 #votes

ప్రజాశక్తి-నరసాపురం
ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓటర్లను కొనేందుకు ధన, వస్తు రూపేణా ప్రలోభ పెడుతుంటారు. హోరాహోరీ పోటీలో తాయిలాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నరసాపురం నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. నరసాపురం మండలం రుస్తుంబాదకు చెందిన జాన్‌ ఎలైజా అనే పౌరుడు ‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’ అంటూ తన ఇంటికి స్టిక్కర్‌ వేశాడు. ఇది మండలంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకులు ఇచ్చే తాయిలాలు తీసుకుని ఓటు వేస్తే, ఐదేళ్ళు నష్టపోవాల్సి ఉంటుందని చుట్టుపక్కల వారికి అవగాహన కల్పిస్తున్నారు. తాయిలాలు తీసుకోకుండా ప్రతి పౌరుడు తన ఓటును నిజాయితీగా.. నిఖార్సయిన నాయకుడికే వేసి నైతిక విలువలు కాపాడాలని ఆయన కోరుతున్నారు.

➡️