మాట నిలబెట్టుకున్నాం.. మళ్లీ గెలుస్తాం : మంత్రి అంబటి రాంబాబు

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : వైసిపి మేనిఫేస్టోను తూచా తప్పకుండా పాటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల విశ్వాసం పొందిన వైసిపి మరోసారి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. వైసిపి ఇచ్చిన హామీలు గురించి చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, కాంగ్రెస్‌ పార్టీ దుష్టచతుష్టయం ఎన్నికుట్రలు పన్నినా జగన్‌ తిరిగి ముఖ్యమంత్రి అవుతారన్నారు. పవన్‌కల్యాణ్‌ను నమ్ముకుంటే కుక్కతోకను పట్టుకుని గోదావరి ఈదినట్టేనన్నారు. ఎన్నికల పొత్తులో జనసేనకు టిడిపి 25 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బాలశౌరి అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్‌ అని, ఎవరికైనా నమ్మకద్రోహం చేసే వ్యక్తి అని ఆరోపించారు.

➡️