‘ఉక్కు’ను నష్టాల్లోకి నెట్టే కుట్రలను అడ్డుకుంటాం

May 11,2024 22:40 #ukkunagaram, #vizag steel
visakha-steel-plant manganese mines

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్రం పన్నుతున్న కుట్రలను ఐక్య పోరాటాలతో అడ్డుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌ డి ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1185వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ ఎస్‌ఎంఎస్‌ విభాగం కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించడంలేదని, కార్మికులను మానసికంగా కుంగదీసేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. వీటికి కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కార్మికుల చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఉక్కు కార్మికులు, ఉద్యోగులు, నిర్వాసితులు కలిసికట్టుగా ఉండి ఈ ఎన్నికల్లో స్టీల్‌ప్లాంట్‌ను కాపాడేవారికే ఓటు వేయాలన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలన్నారు.

➡️