పదవ తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?

Apr 16,2024 12:01 #AP, #results of class 10..?

అమరావతి: గతవారం ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ సంబంధించిన మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సంబంధించిన పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పదవ తరగతి పరీక్ష ఫలితాల కోసం రాష్ట్రంలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
ఇక ఇందుకు సంబంధించి ఏప్రిల్‌ 8వ తారీఖున 10వ తరగతి జవాబుల పత్రాల స్పాట్‌ వాల్యూషన్‌ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇకపోతే అధికారులు ఫలితాల ప్రకటనకు సంబంధించి అధికారులు కొద్దిపాటి కసరత్తులు చేస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ఎటువంటి గందరగోళానికి లోనవ్వకుండా మరోసారి జవాబు పత్రాలను పున:పరిశీలన చేసిన తర్వాత మార్కులను కంప్యూటీరికరణ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అవ్వగానే ఒకటి రెండు రోజుల్లో ఫలితాలను ప్రకటించబోతున్నట్లు అర్థమవుతుంది.
ఇకపోతే పదవ తరగతి ఫలితాలు ఏప్రిల్‌ నెల చివరి వారంలో అనగా.. ఏప్రిల్‌ 25 నుంచి 30 వ తేదీలోపు ఎప్పుడైనా వెల్లడించే అవకాశం ఉంది. ఇందుకుగాను విద్యార్థులు నేరుగా ఎస్‌ఎస్సి బోర్డు అధికార వెబ్‌సైట్‌https://bse.ap.gov.inలో ఫలితాలను చెక్‌ చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలను మే 6న విడుదల చేయగా ఈసారి మాత్రం కాస్త ముందుగానే ఫలితాలను విడుదల చేయబోతున్నారు.

➡️