నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించండి : సిహెచ్‌.బాబూరావు

ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు విజయవాడ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘సిపిఎం జన శంఖారావం’ ఐదో రోజు పాదయాత్ర విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని దేవినగర్‌లో సోమవారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ … ” నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థిని గెలిపిద్దాం… విజయవాడ అభివఅద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసే దమ్మున్న పార్టీలను, నాయకులను ఎన్నుకుందాం.. ” అని అన్నారు. ” భయపడి, బెదిరిపోయి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర సిఎంల వద్ద లంగిపోయి… విజయవాడ అభివఅద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న నాయకులను ఓడిద్దాం…” అని పిలుపునిచ్చారు. విజయవాడలోని ఫ్లైఓవర్‌లు, ప్రాజెక్టులకు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు ఈ పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చెప్పారనీ, అవేవీ ఆచరణలోకి రాలేదని అన్నారు. అటు వైసిపిలోనూ, టిడిపిలోనూ శాసన సభ్యులు, ఎంఎల్‌ఎ లు, మంత్రులు, మేయర్లు ఎన్ని పదవుల్లో ఎందరున్నా రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగిందని అడిగారు. కేంద్రాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ ఎవరు నిలదీయలేకపోతున్నారని అడిగారు. రాజధాని ఒక్కటి కాదు.. 3, 4 అంటుంటే… అమరావతిని, విజయవాడను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ? అంటూ విజయవాడ నుండి గెలిచిన ఏ ఒక్కరైనా అడిగారా ? కనీసం ముఖ్యమంత్రికి వినతిపత్రాన్నిచ్చారా ? అని ధ్వజమెత్తారు. విజయవాడకు కావల్సింది…అధికార పార్టీకి భజన చేసే నాయకులు కాదని.. విజయవాడ తరపున నిలబడే నాయకులు కావాలని అన్నారు. సిపిఎం కమ్యూనిస్టులు దమ్మున్న పార్టీలుగా కేంద్రాన్నయినా, రాష్ట్రాన్నయినా నిలదీస్తామన్నారు. ‘విజయవాడ ను కాపాడుకుందాం – విజయవాడను మారుద్దాం ‘ అని చెప్పారు. ఇష్టానుసారంగా ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, ఖాళీ స్థలాల పన్ను… మున్సిపాలిటీ అంటే పన్నులు వసూలు చేసే సంస్థగా మార్చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయవాడలో పన్నుల భారం తగ్గాలన్నా.. నగరానికి రావల్సిన నిధులను రాబట్టాలన్నా… విజయవాడ తరపున మాట్లాడాలన్నా.. కమ్యూనిస్టులుండాలని అన్నారు. అందుకే ఉమ్మడిపోరుతో పోరాడుతున్నామని.. సిపిఎంను ప్రజలు గెలిపించాలని కోరారు. అసెంబ్లీలోనే కాదు కార్పొరేషన్‌లో కూడా ప్రజావాణిని వినిపించే అవకాశం కల్పించాలని కోరారు. సిపిఎం జనశంఖారావం ఐదో రోజు దిగ్విజయంగా కొనసాగుతోందని.. ప్రజలంతా దీనిలో భాగస్వాములు కావాలని బాబూరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకురాలు కే శ్రీదేవి, డివి కృష్ణ, 30 డివిజన్ కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు, సిపిఎం నగర కార్యదర్శి బి రమణారావు, సెంట్రల్ సిటీ అధ్యక్షుడు కే దుర్గారావు, వాంబే కాలనీ డివిజన్ ఇంచార్జ్ ఎస్ కే పేరు, ప్రజా సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

➡️