యాదాద్రి క్షేత్రంలో యాత్రికుల రద్దీ.. దర్శనానికి 3 గంటల సమయం

యాదగిరిగుట్ట: వేసవి సెలవులు, వారాంతం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి యాత్రికులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మెట్ల దారిలో రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి యాత్రికులు క్యూలైన్లలో బారులుదీరారు. తమ కోర్కెలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ప్రసాద విక్రయ శాల, శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్‌, బస్లాండ్‌లో యాత్రికుల రద్దీ నెలకొంది.

➡️