YS Sharmila: కడప నేతలతో నేడు షర్మిల భేటీ..

Mar 21,2024 11:13 #ap congress, #ys sharmila

ప్రజాశక్తి-విజయవాడ : ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల . విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాదు, తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కడప లోక్‌ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కడప నుంచి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హైకమాండ్‌ కూడా గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు సమాచారం. కాగా రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

➡️