పులివెందులలో వైఎస్‌ సునీత ప్రచారం

  •  షర్మిలకు ఓటు వేయాలని విజ్ఞప్తి

ప్రజాశక్తి – పులివెందుల రూరల్‌ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పులివెందుల పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్‌ సునీత, పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి గురువారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని వినాయక స్వామి ఆలయాన్ని వారు సందర్శించారు. పట్టణ ప్రధాన వీధుల్లో ఓటర్లకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపి అభ్యర్థి వైఎస్‌ షర్మిలకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎంపి అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఓటమి ధ్యేయంగా తాము ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు సునీత తెలిపారు. వైఎస్‌ షర్మి లను గెలిపిస్తే కడప ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలకూ ఆమె ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌ శివప్రకాశ్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రామ్‌రెడ్డి, వేలూరు శ్రీనివాసరెడ్డి, తిరుపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️