ఆహా.. ఏం కొటేషన్‌..! – ఆటోవాలాపై ప్రశంసల వర్షం..!

Apr 10,2024 13:25 #Autowala, #quotation, #Social Media

హైదరాబాద్‌ : కొన్ని కొటేషన్లు చూడగానే ఆకట్టుకుంటాయి.. మరికొన్ని ఆలోచింపచేస్తాయి.. చాలాసార్లు రోడ్లపై వెళుతున్న వాహనాలపై ముఖ్యంగా ఆటోల వెనుక కొటేషన్లు చూస్తుంటాం.. కొన్ని ప్రేమకు సంబంధించినవైతే, మరికొన్ని అనుబంధాల గురించి రాస్తుంటారు… ఓ ఆటో అతను తన ఆటో వెనుక ప్రకృతికి సంబంధించి భావితరాలకు చెప్పాల్సిన మంచి మాట రాశారు. ఇంతకీ ఆ కొటేషన్‌ ఏంటంటే … ”ఎప్పుడైనా చిన్న పిల్లలు వర్షం ఎక్కడి నుండీ వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా.. మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం పడుతుంది అని చెప్పండి” అనే కోటేషన్‌ రాసి దాని పక్కన ఒక చిగురిస్తున్న చెట్టు బొమ్మను వేశాడు. ఈ కొటేషన్‌ ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తుంది కదూ…!

ఆటో కూడా పర్యావరణహితమే..!
అంతేకాదు … ఈ ఆటో కూడా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా సీఎస్‌జీ తో నడిచే ఆటో, అంతేగాక దానిపై ఒక్క చాలాన్‌ కూడా లేదు. అంటే ఆ ఆటో నడిపే వ్యక్తి ప్రకృతి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. పర్యావరణం మీద బాధ్యతతో ఉన్నాడని, సమాజానికి మంచి సందేశం ఇస్తున్నాడని, బహుశా చదువుకున్న నిరుద్యోగి అయి ఉంటాడని ఇలా పలు రకాల కామెంట్లను సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఆ ఆటో అతను పెట్టిన కొటేషన్‌కు సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షమే కురుస్తుంది..!

➡️