ఐదు నిమిషాల్లోనే చార్జ్‌ అయ్యే ఈవీ బ్యాటరీ

Jan 29,2024 16:56 #Electric Vehicles

న్యూయార్క్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ ఈవీ (ఎలక్ట్రికల్‌ వాహనాలు)లవైపు మొగ్గుచూపుతున్నాయి. అయితే ఈవీ బ్యాటరీ చార్జ్‌ మాత్రం ప్రధాన సమస్యగా ఉంది. ప్రస్తుతం ఈవీ బ్యాటరీ మెరుగైన సాంకేతికతతో 30 నిమిషాల్లో చార్జ్‌ అవుతుంది. ఈవీలు వినియోగించాలంటే.. బ్యాటరీల చార్జింగ్‌కే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో వినియోగదారులు వీటివైపు ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఐదు నిమిషాల్లోనే చార్జ్‌ అయ్యే ఈవీ బాట్యరీని అమెరికాలోని కార్నెల్‌ ఇంజనీరింగ్‌ విద్యాసంస్థ ప్రొఫెసర్‌ లిండెన్‌ ఆర్చర్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం కనిపెట్టింది. ఈ బ్యాటరీ ఐదు నిమిషాలు చార్జ్‌ చేసుకోగలిగితే 300 మైళ్ల దూరం ప్రయాణించేందుకు అవసరమైన భారీ బ్యాటరీని కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరకు లభ్యమయ్యే బ్యాటరీతోనే సరిపోట్టుకోవచ్చు. దీంతో విద్యుత్‌ వాహనాల ధరలు తగ్గి వినియోగం పెరుగుతుందని ఆర్చర్‌ తెలిపారు.

➡️