రెండు చేతులు లేని పెయింటర్‌కి.. చేతుల్ని అమర్చిన వైద్యులు

Mar 6,2024 13:37 #Delhi, #trending twitter

న్యూఢిల్లీ : రెండు చేతులు లేని పెయింటర్‌కి ఢిల్లీ సర్‌ గంగారామ్‌ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి తనకు చేతుల్ని అమర్చారు. వివరాల్లోకి వెళితే.. 2020లో జరిగిన రైలు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఓ పెయింటర్‌ తన రెండు చేతుల్ని కోల్పోయి పెయింటింగ్‌కి దూరమయ్యాడు. అయితే సౌత్‌ ఢిల్లీ స్కూల్‌లో పనిచేస్తున్న మీనా మెహతా అనే ఆమె ఇటీవల బ్రెయిన్‌ డెడ్‌ అయి మృతి చెందింది. ఆమె మరణానంతరం తన అవయవాలను దానం చేశారు. తన కిడ్నీ, లివర్‌, కార్నియాలను ముగ్గురికి అమర్చగా.. ఆమె చేతుల్ని వైద్యులు పెయింటర్‌కు అమర్చారు. సర్జరీ కోసం గంగారామ్‌ ఆసుపత్రి డాక్టర్లు సుమారు 12 గంటలపాటు కష్టపడ్డారు.. డాక్టర్లు పడ్డ కష్టం ఫలించింది. ఇప్పుడు ఆ పెయింటర్‌ చేతులు సాధారణ వ్యక్తుల మాదిరిగానే పనిచేస్తున్నాయి. తన చేతులతో థమ్స్‌ అప్‌ సంకేతం ఇస్తూ.. డాక్టర్లతో ఫొటో కూడా దిగారు.

➡️