గురువుకి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన ప్రభాస్‌

Dec 6,2023 12:00 #movie, #prabhas

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌ తాజాగా తనకు విద్య నేర్పిన గురువుకి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చారు. ఇంతకీ ఆ గురూజీ ఎవరనుకుంటున్నారా? ప్రభాస్‌తోపాటు, పవన్‌కల్యాణ్‌, వరుణ్‌తేజ్‌, శర్వానంద్‌ వంటి పలువురు హీరోలకు నటన నేర్పిన సత్యానంద్‌. నటనలో మెలకువలు నేర్పిన తన గురువు సత్యానంద్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్‌ తన ఇంటికి వెళ్లి మరీ గిఫ్ట్‌ ఇచ్చాడు. బర్త్‌డే స్పెషల్‌గా బంగారపు వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. స్వయానా ప్రభాస్‌నే గురువు చేతికి వాచ్‌ని తొడిగాడు. ఈ సందర్భంగా ‘ఇది నిజమైన బంగారం, పొరపాటున ఎక్కడపడితే అక్కడ పడేయకండి’ అని గురూజీని ప్రభాస్‌ కోరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్‌ సినిమాల విషయానికొస్తే.. ‘సలార్‌’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించారు.

➡️