ఎస్‌బిఐ నాలుగు కొత్త శాఖల ప్రారంభం

Feb 17,2024 21:17 #Business

కృషి హోమ్‌ అనాథాశ్రమానికి సాయం

ప్రజాశక్తి – హైదరాబాద్‌:స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రిటైల్‌ బిజినెస్‌ అండ్‌ అపరేషన్స్‌) వినరు ఎం టోన్సె హైదరాబాద్‌ సర్కిల్‌ను సందర్శించారు. నాలుగు కొత్త శాఖలు, ఒక్క ఆర్‌ఎసిపిసిను వర్య్చూవల్‌గా ఆయన ప్రారంభించారు. అదే విధంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గని మాట్లాడారు. కోటిలోని స్థానిక హెడ్‌ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌) కార్యక్రమంలో భాగంగా మెడ్చల్‌ జిల్లాలోని గౌడవెల్లి గ్రామంలోని కృషి హోమ్‌ అనాథాశ్రమానికి టాటా వింగర్‌ స్కూల్‌ బస్‌, ఓపెన్‌ జిమ్‌ పరికరాలను అందజేశారు. ఈ అనాథాశ్రమాన్ని అసోసియేషన్‌ సాయికొరియన్‌ (అల్యూమిని ఆఫ్‌ సైనిక్‌ స్కూల్‌ కొరుకొండ) నిర్వహిస్తోంది. ఆ సంస్థ ప్రెసిడెంట్‌ భాస్కర్‌ రావుకు వాహన తాళం చెవులను అందజేశారు. అనంతరం ఎండి టోన్సే జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. బలహీన వర్గాలకు సాయం చేయడంలో ఎస్‌బిఐ చాలా బాధ్యతగా వ్యహారిస్తుందన్నారు. హైదరాబాద్‌ సర్కిల్‌ ఎస్‌బిఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాజేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పేద, అనాథ విద్యార్థులకు అసోసియేషన్‌ సాయికొరియన్‌ చేస్తున్న కృషిని ప్రశంసించారు. విద్యా, ఆటలు ఇతర అభివృద్థికి మద్దతు చేయడం గొప్ప విషయమన్నారు. మొత్తం సిఎస్‌ఆర్‌ నిధుల్లో తాము 30 శాతం వైద్యానికి కేటాయిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా ఎస్‌బిఐకి భాస్కర రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ ఉన్నతాధికారులు సహదేవన్‌ రాధా క్రిష్ణన్‌, మంజూ శర్మ, దేబాశిష్‌ మిత్రా, స్వామినాథన్‌, విద్యా రాజా, మనోజ్‌ కక్కర్‌ సహా ఇతర డిప్యూటీ మేనేజర్లు, సినియర్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️