కర్నాటకలో టికెఎం రూ.3,300 కోట్ల పెట్టుబడులు

Nov 22,2023 21:25 #Business

బెంగళూరు : కర్నాటకలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టికెఎం) ప్రకటించింది. 2026 నాటికి అందుబాటులోకి రానున్న ఈ యూనిట్‌ కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఇందుకోసం రూ.3,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇక్కడ ఏడాదికి లక్ష యూనిట్ల తయారీ చేపట్టనున్నామని.. 2వేల మందికి ఉపాధి లభించనుందని వెల్లడించింది.

➡️