కార్యాలయాలకు రాకుంటే కెరీర్‌ ఎదుగుదలకు బ్రేక్‌

Feb 6,2024 21:05 #Business

ఉద్యోగులకు డెల్‌ వార్నింగ్‌

న్యూఢిల్లీ: ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయాల్లో పని చేయాలని లేదంటే కెరీర్‌కు ఎదురుదెబ్బ తప్పదని డెల్‌ తమ సిబ్బందిని హెచ్చరించింది. కరోనా మహమ్మారితో ఇతర టెక్‌ దిగ్గజాల తరహాలోనే డెల్‌ సైతం ఉద్యోగులకు రిమోట్‌ వర్క్‌ సదుపాయాన్ని కల్పించింది. ఉద్యోగుల్లో 60 శాతం మంది రోజూ ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేస్తున్నారు. అయితే కరోనా నెమ్మదించడంతో కార్యాలయాలకు గంట సేపటిలో చేరుకునే దూరంలో ఉన్న ఉద్యోగులందరూ వారానికి కనీసం మూడుసార్లు ఆఫీస్‌కు రావాలని ఆదేశించింది. ప్రస్తుతం దూరంతో సంబంధం లేకుండా ఉద్యోగులందరూ వారానికి మూడు సార్లు కార్యాలయం నుంచి పనిచేయాల్సిందేనని తాజాగా స్పష్టం చేసింది. అయితే తక్కువ వేతనాలకు పనిచేసే కొందరు సిబ్బందికి పూర్తి కాలం రిమోట్‌ వర్క్‌ వెసులుబాటు కల్పించింది.

➡️