కొత్త ఉద్యోగంపై 89 శాతం మంది దృష్టి

Jan 17,2024 21:30 #Business
  • లింక్డ్‌ ఇన్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ : ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో నిపుణులు తమ కెరీర్‌ భద్రతపై మరింత దృష్టి కేంద్రీకరిస్తున్నారని లింక్డిఇన్‌ వెల్లడించింది. దేశంలోని ప్రతీ 10 మందిలో దాదాపు 9 మంది (88%) నిపుణులు 2024లో కొత్త ఉద్యోగాన్ని పరిశీలిస్తున్నారని లింక్డ్‌ఇన్‌ తాజా ‘జాబ్స్‌ ఆన్‌ ది రైెజ్‌ లిస్ట్‌’ అధ్యయనంలో పేర్కొంది. ఇది ఏడాదికేడాదితో పోల్చితే 2023లో 4 శాతం పెరిగిందని పేర్కొంది. లింక్డ్‌ఇన్‌ డాటా దాని ప్లాట్‌ఫారమ్‌లో జాబ్‌ సెర్చ్‌ యాక్టివిటీ 2022తో పోలిస్తే 2023 సంవత్సరంలో 9 శాతం పెరిగిందని పేర్కొంది.

➡️